NandyalAbdul Javid

టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ను కలిసి కృతజ్ఞ్యతలు తెలిపిన అమీర్

టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ను కలిసి కృతజ్ఞ్యతలు తెలిపిన అమీర్

నంద్యాల (పల్లెవెలుగు) 19 ఏప్రిల్: తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ కార్యాలయంలో 10వ వార్డుకు చెందిన షేక్ అమీర్ నంద్యాల పార్లమెంట్ మైనారిటీ సెల్ కమిటీ లో అఫిషియల్ స్పొక్స్ పర్సన్ గా ఎన్నికైనందున  మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్  ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞ్యతలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు, విద్యుత్ చార్జీలు ఏడుసార్లు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఇసుక, ఇనుము, సిమెంట్ , మద్యం ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అమాంతం పెంచుకుంటూ పోయిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు ఇంకేం పెంచుదాం??? అని ఆయన ఆలోచన ధోరణి ఉందని హితవు పలికారు. గ్రామాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు  పోతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. మూడు సంవత్సరాల పాలనలో విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని తెలిపారు. ఆర్టీసీ చార్జీలు పెంచి, పేద, సామాన్య  వర్గాలకు చెందిన ప్రజల పై మరో ఆర్థిక భారం మోపారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఏమి కొనలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ, ప్రజల నుంచి పన్నుల భారం మోపుతూ రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం తగ్గించే వరకు టీడీపీ  ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.  అమ్మఒడికి ఆంక్షలు తగదు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి కొత్తగా ఆంక్షలు విధించడం తగదని ప్రత్తిపాటి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక్కపైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని ప్రభుత్వం ఇప్పటి నుండే ఆలోచనలు మొదలు పెట్టిందన్నారు. అందులో భాగంగానే విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే, 75% హాజరు లేకుంటే అమ్మఒడి కట్ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల హామీలో భాగంగా ఆనాడు బేషరతుగా ప్రతి తల్లికి అమ్మ ఒడి వర్తిస్తుందని మీరు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో, ఆ మాటకే ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ పట్టణ కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ స్వర్ణ కారుడు అమీర్ గత 15 సంవత్సరాల నుండి టిడిపిలో కార్యకర్తగా తన సేవలు అందిస్తున్నారని ఈ రోజు ఆయన చేసిన కృసి చూసి ఈ బాధ్యతను ఆయన కు అప్పగించడం జరిగిందని పార్టి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అని ప్రతి కార్యకర్త కు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఎం. గౌస్, వారిస్, కరిముల్లా, బాబు, ఇమ్రాన్, ఆయుబ్, ఖాజా మౌలానా, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks