NandyalAbdul Javid

ఈద్గాహ్ కు 5 ఎకరాల వక్ఫ్ బోర్డ్ స్థలం కేటాయించాలి – నంద్యాల ముస్లిం జేఏసి

ఈద్గాహ్ కు 5 ఎకరాల వక్ఫ్ బోర్డ్ స్థలం కేటాయించాలి – నంద్యాల ముస్లిం జేఏసి

నంద్యాల (పల్లెవెలుగు) 19 ఏప్రిల్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జనాబ్ ఖాదర్ బాష మరియు ఎమ్మెల్సి  ఇసాక్ బాష ని నంద్యాల ముస్లిం JAC అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు S.Md. అబులైస్, S అబ్దుల్ సమద్ ల ఆధ్వర్యం లో జేఏసి నాయకులు,  ఎమ్మెల్సి ఇసాక్ బాష కార్యాలయం లో కలిసి ఈద్గా మరియు ముస్లిం ల అభివృద్ధి కోసం 5 ఎకరాల వక్ఫ్ భూమి కేటాయించాలని కోరారు. నంద్యాల టౌన్ లో ప్రస్తుతము ముస్లింల జనాభా ఒక లక్ష పైచిలుకే ఉన్నదని, కానీ ఈ జనాభా అవసరాలకు తగినట్లుగా ప్రస్తుతం ఉన్న ఈద్గాహ్ లు ఖబరాస్తాన్ లు సరిపోవడం లేదని, దివానే సాహెబ్ కి దర్గాహ్ (తిక్క స్వామి దర్గా) లో ఉండే ఖబరిస్తాన్, ఈద్గా లకు ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలైన నూనెపల్లె, బొగ్గు లైన్, టీచర్స్ కాలనీ, నౌమాన్ నగర్, సాదిఖ్ నగర్, ఎన్జీవోస్ కాలనీ,  హౌసింగ్ బోర్డు కాలనీ, ఎస్బిఐ కాలనీ, రెవెన్యూ క్వార్టర్స్,  విశ్వ నగర్, వీసీ కాలనీ, మొదలగు ప్రాంత ప్రజలు రంజాన్, బక్రీద్ పండుగల ప్రార్థనలకు వస్తూ ఉంటారని. తిక్క స్వామి దర్గాకు పక్కనే ఉన్న జనరల్ హాస్పిటల్ లో వివిధ ప్రాంతాల నుండి వైద్యం కోసం వచ్చి చనిపోయిన వారిని కూడా ఇక్కడే దఫన్ (ఖననం) చేస్తారని. ఈ పరిస్థితుల్లో దర్గాహ్ కు వెనక భాగంలో ఉన్న సుమారు 60 సెంట్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న స్థలం లో నేడు  సగ భాగం ఈద్గాహ్ కు, ఇంకొక సగభాగం ఖబరాస్తాన్ కు వాడుతున్నారని,  ప్రజల సంఖ్య అసంఖ్యాకంగా ఉన్నందున ఇటు ఈద్గాహ్ కు గాని అటు ఖబరాస్తాన్ కు గాని స్థలం సరిపోవడం లేదు. కావున ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నూనెపల్లె జామియా మస్జీద్ కు చెందిన రైతునగరం వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఐదు ఎకరాల స్థలం ముస్లిం ల ఈద్గాహ్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం  కేటాయించాలని వినతి పత్రం ఇచ్చారు.  ఖాదర్ బాష సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం లో అబ్దుస్ సలాం IUML, కాంట్రాక్టర్ అబ్దుల్లా, మస్తాన్ ఖాన్ కాంగ్రెస్, యూనుస్ MHPS, A.K.ఖాన్ APSRTC, రెడ్ క్రాస్ దస్తగిరి, బియ్యం వ్యాపారి గౌస్ భాయ్, మార్కెట్ కలామ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks