NandyalAbdul Javid

జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతారనే గొప్ప సిద్ధాంతాన్ని మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ ఎన్.ఎమ్.డి ఫారూఖ్

జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతారనే గొప్ప సిద్ధాంతాన్ని మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ ఎన్.ఎమ్.డి ఫారూఖ్

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివకులర్పించారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నంద్యాల ఎన్.ఎమ్.డి ఫారూఖ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావనే గొప్ప సిద్ధాంతాన్ని మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో  ప్రజాస్వామ్య పరిపాలనకు మూలస్థంబమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి బాబా సాహెబ్ అని భవిష్యత్తు తరాల కోసం, బడుగు బలహీన ప్రజల రక్షణ కోసం రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ అధికారులు పని చేయాలన్నారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి  ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్  నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్ర శివనందా రెడ్డి నంద్యాల మాజీ శాసన సభ సభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు

Back to top button