NandyalAbdul Javid

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా బొమ్మల సత్రం లో వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు మాట్లాడుతూ  అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువరానివి భారత రాజ్యాంగం రాసిన మహా మేధావిగా వర్ణించారు .భారత రాజ్యాంగము ఈనాడు ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందినది. ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకోటు వాసు మాట్లాడుతూ రాజ్యాంగము లౌకిక రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు  అతి పెద్ద భారత దేశము సామ్యవాద సౌభ్రాతృత్వం కలిగిన మన భారతదేశం .అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు , ధనిక, పేద ,హరిజన ,గిరిజన అనే భేదం లేకుండా అంటరానితనం నేరం అనే భావంతో భారత రాజ్యాంగాన్ని వ్రాసిన గొప్ప యోధుడు .అలాగే ఐర్లాండ్ నుండి ఆదేశ సూత్రాలను బ్రిటీష్ పార్లమెంటు ననుసరించి భారత దేశ పార్లమెంటు ఉండాలని భావముతో అన్ని విషయాలను సేకరించి రాజ్యాంగాన్ని తయారు చేశాడు. అలాగే అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు .ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్. చింతల మోహన్ రావు , రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, sc సెల్ విభాగ కార్యదర్శి కరాటే బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శివ రామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ విశ్వనాధ్ ,సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks