NandyalAbdul Javid

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: బొమ్మలసత్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయపులికొండన్న మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్టికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజికసంస్కర్తగా భారతీయులకు పరిచయం అక్కర్లేదని, అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందని, అంటరానితనంపై ఆయానపూరించిన సమరశంఖం నేటికి అగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉందని బడుగు బలహీనవర్గాల మహిళలు, కార్మికుల హక్కులకోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్పయోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ విఆర్పీఎస్ న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బారాయుడు, నంద్యాల నియోజకవర్గ విఆర్పీఎస్ అధ్యక్షులు మదుగోపాల్, నంద్యాల పట్టణ విఆర్పీఎస్ యూత్ ఉపాధ్యక్షులు రమేష్, పట్టణ నాయకులు శ్రీనివాసనాయుడు, ఆటో మధు, మహేష్, రమేష్, రవి తదితరులు పాల్గోన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks