Nandyalbaba

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లా  ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లా  ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: వేసవి కారణంగా రక్త నిల్వలు లేక నంద్యాలలో మెరుగైన వైద్యం కోసం వచ్చిన గర్భిణీ మహిళలు, తలసీమియా చిన్నారులు, రక్తహీనతతో ఉన్న పేషంట్లు మరియు యాక్సిడెంట్ భాదితులు రక్తం దొరకక బ్లడ్ బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి నాడు రక్తదాన శిబిరం నిర్వహించినట్లు నంద్యాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయం సిఐ కృష్ణ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా కర్నూల్ జిల్లా జోన్ ఎక్సైజ్ ఆబ్కారీ మరియు మధ్యనిషేధ డిప్యూటీ కమీషనర్ జి.మునిస్వామి, నంద్యాల జిల్లా ఎక్సైజ్ ఆబ్కారీ మరియు మధ్యనిషేధ సూపరింటెండెంట్ రవికుమార్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీలత, ఏపీ.ఎస్.బి.సి.ఎల్ ఐ.ఏం.ఎల్ డిపో ఎక్సైజ్ ఆబ్కారీ మరియు మధ్యనిషేధ ఇన్స్పెక్టర్లు లు కృష్ణకుమార్, రామకృష్ణ రెడ్డి, శిరీష, కృష్ణమూర్తి లు, ఏపీ.ఎస్.బి.సి.ఎల్ ఐ.ఏం.ఎల్ డిపో ఎక్సైజ్ ఆబ్కారీ మరియు మధ్యనిషేధ ఎస్.ఐ లు సందీప్, వెంకటేశ్వర్లు, అస్లాం, శ్రీనివాసులు మరియు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అతిథులు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని అంబేద్కర్ గారి జయంతి నాడు ఈ మహా కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సిబ్బందిని అభినందించారు. కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు ఓబులేసు మరియు కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు కలిసి 70 మంది స్వచ్చందంగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసరా సొసైటీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, విజయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks