NandyalAbdul Javid

విప్లవ విద్యార్థి ఉద్యమ అరుణ తార కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయ సాధన కై పోరాడుదాం

  • విప్లవ విద్యార్థి ఉద్యమ అరుణ తార కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయ సాధన కై పోరాడుదాం
  • జార్జి రెడ్డి 50వ వర్ధంతి సభ
  • పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ

 నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: విప్లవ విద్యార్థి ఉద్యమ అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్ధంతి కార్యక్రమాన్ని పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో గురువారం నాడు స్థానిక సాయిబాబా నగర్ లో ఉన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పిడిఎస్యు జిల్లా  అధ్యక్షుడు S.M.D.రఫీ  మాట్లాడుతూ  కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక విద్యార్థి మేధోవర్గాన్ని తయారు చేశాడని అన్నారు. దేశంలోని సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలపై సైద్ధాంతికంగా విశ్లేషణలు జరిపారని అన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి  విద్యార్థి ఉద్యమ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం అయ్యేంతగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేశాడని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఆధిపత్య ఉన్మాది మూకలతో నిత్యం పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విద్యార్థి ఉద్యమాలను నిర్మించడాని తెలియజేశారు. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయ సాధనలో భాగంగా పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో శాస్త్రీయ విద్యా సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన సమాజాన్ని కలగన్న విద్యార్థి నాయకుని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో తమ వంతు పాత్రని బిన్నారంగాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే జార్జి రెడ్డికి నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పట్టణ అధ్యక్షడు దస్తగిరి, పిడియస్ యు కార్యదర్శి నవీన్ బాబు, పిడియస్ యు ఉపాధ్యక్షులు అజిత్, వెంకటేష్ సహాయ కార్యదర్శిగా రాజేష్ ,రాజు, కోశాధికారి వంశీ, సభ్యులు షాకీర్ , వినయ్, తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks