NandyalAbdul Javid

దివ్యాంగుల పెన్షన్ లు పెంచాలి

దివ్యాంగుల పెన్షన్ లు పెంచాలి

డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 13 ఏప్రిల్:  వైయస్సార్ సిపి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటుతున్నా కూడా వికలాంగుల పెన్షన్ పెంచడం లేదని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను బట్టి, వికలాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల వరకూ చేయాలని డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపీ మస్తాన్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జగజ్జనని నగర్ లోని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (DRWA/AP) కార్యాలయంలో మస్తాన్ వలీ మాట్లాడుతూ వైయస్సార్సీపి వైయస్ జగన్  ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఒక పెన్షన్ తప్ప వికలాంగులకు ఈ ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖకు అసలు బడ్జెట్ కేటాయించలేదని దీనిని బట్టి చూస్తుంటే వికలాంగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో అర్థం  అవుతుందని అన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఎలాంటి పని చేసుకోలేని వికలాంగుల పై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని అన్నారు. వికలాంగులకు అంత్యోదయ కార్డులు, వివాహ ప్రోత్సాహాలు, సబ్సిడీ రుణాలు, ఇంటి స్థలం తో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన మంత్రిమండలి త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో వికలాంగులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న  వికలాంగుల సంజీవిని అయిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ను అమలు చేయాలని మస్తాన్ వలి  డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోతే వైసీపీ వికలాంగులు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్  రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్ నబి రసూల్  అబ్దుల్ కలాం సుభాష్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సయ్యద్ మౌలాలి, చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నబి రసూల్  తదితరులు పాల్గొన్నారు.

Back to top button