NandyalAbdul Javid

జిల్లా కలెక్టర్ ని సంయుక్తంగా ఘనంగా సత్కరించిన నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఆల్ మేవా

జిల్లా కలెక్టర్ ని సంయుక్తంగా ఘనంగా సత్కరించిన నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఆల్ మేవా

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: నంద్యాల ముస్లిం జెఎసి అధ్యక్షులు ఎస్.ఎండి. అబులైస్, మరియు మౌలానా అబ్దుస్సలాం IUML, మరియు ఆల్ మేవా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎస్ ఇమ్రాన్ పాషా, ఎస్ ఎండి. సలీం ల ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి, నంద్యాల జిల్లా కు మొట్టమొదటి జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఆయనను పూల బొకే, మొమెంటో, శాలువలతో ఘనంగా సత్కరించి మైనార్టీల సమస్యల గురించి మెమోరాండం ఇచ్చారు. పిఎంజెవికె, ద్వారా కేటాయించబడిన 6 భవన సముదాయాల నిర్మాణానికి  స్థల కేటాయింపు త్వరితగతిన చేయాలని.  ప్రభుత్వ కార్యాలయాలపై వాటి పేర్లు రాష్ట్ర రెండవ అధికార భాష అయిన ఉర్దూ భాషలో రాయించాలని రంజాన్ నెల సందర్భంగా ఉపవాస దీక్షలో గల ముస్లిం భక్తులకు ఇబ్బంది కలగకుండా మసీదులు ముస్లిం ప్రాంతాలలో కరెంటు కోతలు లేకుండా చూడాలని, శానిటేషన్ చర్యలు తీసుకోవాలని, త్రాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని, ముఖ్యంగా పోలీసు వారు రాత్రిపూట తరావి నమాజు మరియు ఉదయం సహరిలా కోసం  రక్షణ మరియు రాత్రి  హోటల్ లు తెరవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఆల్ మేవా జరపబోవు రంజాన్ తోఫా కార్యక్రమానికి ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ గారు అన్నింటినీ సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లతీఫ్, వైస్ ప్రెసిడెంట్లు నబిరసూల్, సైఫుల్ల,మహమ్మద్ రఫీ, జాకీర్, మీర్జా మాలిక్ బేగ్, ఖాసీం, మొదలగు వారు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks