
NandyalAbdul Javid
టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన షేక్ మహబూబ్ బాషా
టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన షేక్ మహబూబ్ బాషా
నంద్యాల (పల్లెవెలుగు) 12 ఏప్రిల్: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు షేక్ మహబూబ్ బాషా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ గా తనను నియమించడం చాలా సంతోషంగా ఉందని పార్టీకి విధేయుడిగా కొనసాగుతానని తనపై నమ్మకంతో పార్టీ మీడియా భాధ్యతను అప్పగించినందుకు పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్. ఎమ్.డి ఫారూఖ్ మరియు ఎన్.ఎమ్.డి ఫిరోజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి సుహైల్ రానా కార్యకర్తలు మున్న ఇస్మాయిల్ ఫిరోజ్ (గాంధీ)పాల్గొన్నారు