
ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా కన్వీనర్ గా జిఎం గౌస్
ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా కన్వీనర్ గా జిఎం గౌస్
నంద్యాల (పల్లెవెలుగు) 12 ఏప్రిల్: ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా కన్వీనర్ గా జిఎం గౌస్ ను నియమించినట్లు ఆలిండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి, అడ్వకేట్ అబ్దుల్ ఖదీర్ షుఐబీ నిజామీ తెలిపారు. మంగళవారం నంద్యాల ఎన్జీఓ కాలనీలోని మిల్లీ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల విస్తరణ జరిగింది కాబట్టి 26 జిల్లాల కొత్త రాష్ట్ర సంస్థ మరియు జిల్లా సంస్థలు ఏర్పాటు, పదవీకాలం తర్వాత అన్ని జిల్లాల సంస్థలు రద్దు చేయడమయిందన్నారు. రంజాన్ తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, కాబట్టి అప్పటి వరకు జి.ఎం. గౌస్ ను నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమించడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా 51 మంది సభ్యులతో కూడిన కొత్త జిల్లా కమిటీ ఏర్పాటు అవుతుందన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆల్ ఇండియా మిల్ కౌన్సిల్ యొక్క నంద్యాల డివిజన్ బాడీ రద్దు చేయబడిందని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యక్షులు అబ్దుల్ రహిమాన్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ భాష, సౌదగర్ మీయ్య, సభ్యులు జావిద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.