NandyalAbdul Javid

సీఎం జగన్ను కలిసిన డాక్టర్ మధు

సీఎం జగన్ను కలిసిన డాక్టర్ మధు
వాల్మీకుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించిన మధు

ఎమ్మిగనూరు (పల్లెవెలుగు)  ఏప్రిల్ 8:  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  నూతన జిల్లాల ఏర్పాటు చేసిన తరువాత, తొలిసారిగా శుక్రవారం నంద్యాల జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ అలంపూర్ మధుసూదన్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కి పునరుద్ధరించాలని, వాల్మీకి జయంతి పర్వదినానికి సెలవు ప్రకటించాలని, వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వమే నిర్వహించాలని,  పొందుపరిచిన అంశాల వినతి పత్రాన్ని సీఎం జగన్ కు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సమస్యలను పరిష్కరించాలని తన వంతు కృషి చేస్తానని సీఎం జగన్ డాక్టర్ మధు కు హామీ ఇవ్వడం జరిగింది.

Back to top button