NandyalAbdul Javid

విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పిలుపు

విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పిలుపు

నంద్యాల (పల్లెవెలుగు) 08 ఏప్రిల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా పర్యటన రాక సందర్భంగా అర్ధరాత్రి విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎన్.శంకర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థి ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల నాయకులను శాంతియుతంగా ఆందోళనలు చేయకుండా చలో విజయవాడ లాంటి కార్యక్రమాలను అడ్డుకుంటూ అడుగడుగున అరెస్టు చేస్తూ ఉద్యమాలపై ఉద్యమ నాయకుల పై నిర్బంధాన్ని కొనసాగిస్తుందని పౌర హక్కులను కాలరాస్తున్నదని ఆయన వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలన అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఖండించాలి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చదువుకున్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని తదితర డిమాండ్లతో విద్యార్థి సంఘం నాయకులు నిరసన గళం విప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అర్ధరాత్రి విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో అరాచక శక్తులను అసాంఘిక శక్తులను రౌడీషీటర్ల అరెస్టు చేయడం లేదని ప్రజా విద్యార్థి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తే ముందస్తు అరెస్టు చేయడం అక్రమంగా నిర్బంధించడం ఏమిటని ఇది ప్రజాస్వామ్యమా నిరంకుశ పాలన అని ఆయన విమర్శించారు తక్షణమే అరెస్టు చేసిన పిడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రఫీ,  ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధనుంజయ,  ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బెనర్జీని తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను సిపిఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.శంకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులూ అక్రమాలతో ఉద్యమాలను ఆపలేరని మరింత ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి గుర్తించాలని తెలిపారు

Back to top button
Enable Notifications    OK No thanks