NandyalAbdul Javid

సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం

సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం

నంద్యాల (పల్లెవెలుగు) 08 ఏప్రిల్: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నంద్యాల R.S రోడ్, పెద్ద చర్చి పక్కన ఉన్న సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలోని పిల్లల తో “డాక్టర్ కాత్యాయిని రెడ్డి  తన పుట్టినరోజు వేడుకను జరుపుకుని ఈ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు డాక్టర్ కాత్యాయిని రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి మాట్లాడుతూ  ” డాక్టర్ కాత్యాయిని రెడ్డి కరోనా సమయంలో పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ  వారికి శానిటైజర్స్ చేతి  బ్లౌజులు, గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమములు, రక్తదానం  చేసి తమ యొక్క సేవ గుణమును వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యులు  హుస్సేన్ వలి, ఎల్లయ్య పాల్గొన్నారు.

Back to top button