NandyalAbdul Javid

నంద్యాలలో జిల్లా  ప్రధాన సెంటర్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

నంద్యాలలో జిల్లా  ప్రధాన సెంటర్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

నంద్యాల (పల్లెవెలుగు) 06 ఏప్రిల్: స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని శ్యాముల్ ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  షేక్.రియాజ్, MSF రాష్ట్ర అధికార ప్రతినిధి బాయికాటి బెనర్జీ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి రామకృష్ణ  మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నంద్యాల జిల్లా ప్రధాన సెంటర్లో ఏర్పాటుకై అధికారులు, మరియు అధికార పార్టీ నాయకులు , ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని. లేకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉద్యమలకు సిద్ధమని, గతంలో ఎన్నోసార్లు అధికారులకు, మరియు ప్రజా ప్రతినిధులకు కూడా ఎన్నో సార్లు  వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని కానీ ఇంతవరకు నంద్యాల జిల్లా  ప్రధాన సెంటర్లలో డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత వరకు కనీసం అధికారులు కూడా ఒక చొరవ కూడా చూపించడం లేదని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం విడకపోతే ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ , విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో కలిసి దశల వారి ఉద్యమలకు శ్రీకారం చుడతానని వారు ప్రభుత్వనికి హెచ్చరిక తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా  జాయింట్ సెక్రటరీ పి.రమణ, నంద్యాల జిల్లా  నాయకులు రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు

Back to top button