NandyalAbdul Javid

నంద్యాల జిల్లా కలెక్టర్ , డి ఇ ఓ లను కలిసిన రూట ఏపి నాయకులు

నంద్యాల జిల్లా కలెక్టర్ , డి ఇ ఓ లను కలిసిన రూట ఏపి నాయకులు

నంద్యాల (పల్లెవెలుగు) 06 ఏప్రిల్: నూతన జిల్లా గా ఏర్పడిన నంద్యాలకు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనాజిర్ జిలానీ సమూన్ ను బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట ఏపి) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి కే కలీం,  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పఠాన్ ఏహ్సానుల్లా ఖాన్, నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షులు పఠాన్ జక్రీయ అలీ ఖాన్ లు  మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం, రూట డైరీ అంద జేసీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా రూట రాష్ట్ర నాయకులు కలీం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పఠాన్ ఏహ్సానుల్లా ఖాన్ లు మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలల, కళాశాలలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ మనాజిర్ జిలానీ సమూన్ కు కోరారు. అనంతరం నూతనంగా జిల్లా విద్యా శాఖ అధికారి గా బాధ్యతలు చేపట్టిన బి. సత్య నారాయణ మూర్తి కు స్వాగతం పలుకుతూ పుష్ప గుచ్చం ,రూట డైరీ అంద జేసీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నంద్యాల మండల విద్యా శాఖ అధికారి బ్రహ్మం నాయక్, రూట జిల్లా నాయకులు మహబూబ్ బాషా, ముహమ్మద్ గౌస్, ఇబ్రహీం,p తాహిర్ బాషా, నంద్యాల రీజనల్ నాయకులు దస్తగీర్, మస్తాన్, జాని బాషా,అఫ్జల్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks