NandyalAbdul Javid

ఉషా మనోవికాస్ స్కూల్ లోని మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం

ఉషా మనోవికాస్ స్కూల్ లోని మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం

నంద్యాల (పల్లెవెలుగు) 05 ఏప్రిల్: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల శ్యాం కాలువ సెంటర్ కల్పనా రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఉషా మనో వికాస్ స్కూల్ లోని పిల్లలకు “DSC చదువుతున్న రాణి తన స్నేహితులు సుమలత, రమేష్, నాగేశ్వరరావు లతో కలిసి ఈ మానసిక పిల్లలకు మంచి రుచికరమైన భోజనం  ఏర్పాటు చేసి పిల్లల యొక్క సంతోషాన్ని పాలుపంచుకున్నారు. “రాణి తన స్నేహితులతో కలిసి మంచి భోజనం ఏర్పాటు చేసినందుకు ఉష మనో వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు నిర్వాహకురాలు అయిన ఉషా మేడమ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, రాణి మరియు వారి స్నేహితులు పాల్గొన్నారు.

Back to top button