NandyalAbdul Javid

ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం

ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం

నంద్యాల (పల్లెవెలుగు) 05 ఏప్రిల్: పట్టణ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద, ఆత్మకూర్ బస్టాండ్ వద్ద ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రహిమాన్ రషాది, ప్రధాన కార్యదర్శి జిఎం గౌస్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాష, మౌలానా అబ్దుల్లా, కౌన్సిల్ సభ్యులు జావీద్, హమీద్, హఫీజ్ ఇలియాజ్, అబ్దుల్ మజీద్, హఫీజ్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, వేసవిలో కులమతాలకతీతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks