NandyalAbdul Javid

నంద్యాల జిల్లా ఏర్పాటుతో గిరిజనులు మిన్నంటిన సంబరాలు

నంద్యాల జిల్లా ఏర్పాటుతో గిరిజనులు మిన్నంటిన సంబరాలు
నంద్యాల జిల్లా దశాబ్దాల కల సాకారం
గిరిజన విద్యార్థినిలతో కలిసి మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్న గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు,
థాంక్యూ సీఎం సార్ అంటూ జగన్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం
జిల్లాల పునర్విభజన చరిత్రాత్మకం…. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్.

నంద్యాల (పల్లెవెలుగు) 05 ఏప్రిల్:  జిల్లా ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇది చారిత్రాత్మకమైన రోజు అని, వికేంద్రీకరణ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ చెప్పారు. నంద్యాల జిల్లా ఏర్పాటును స్వాగతిస్తూ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని స్థానిక గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో గిరిజన బాలికల తో కలిసి జిపిఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని అంబరాన్నంటిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం థాంక్యూ సీఎం సార్ అంటూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏపీలో విజయనగరం, ప్రకాశం 2 జిల్లాలు మాత్రమే కొత్తగా ఏర్పడ్డాయని, మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ పాలనలో  పునర్విభజన జరిగిందని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జిల్లాల పునర్విభజన చేశారని అన్నారు. నంద్యాల జిల్లా కావాలనేదే ప్రజల చిరకాల కోరికఅని ఆ కోరికను సీఎం జగన్ దశాబ్దాల కల సాకారం చేశారని అన్నారు. పాదయాత్రలో నంద్యాల ను జిల్లా చేస్తానన్న హామీని సీఎం జగన్ జిల్లాగా మార్చి చూపించారన్నారు. నంద్యాల జిల్లా ఏర్పాటుతో ఎంతోమంది గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా ఏర్పాటు కోసం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంతో కృషి చేశారని, అసెంబ్లీలో ప్రస్తావించడం, చిరకాల కోరికను ఈరోజు సాకారం చేశారని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి, రవి నాయక్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, వైయస్సార్ సిపి నాయకులు చాబోలు నారాయణ వెంకటేష్ జివిఎస్ రవీంద్ర నాయక్ మరియు గిరిజన విద్యార్థినిలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks