NandyalAbdul Javid

7 వ సారి విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం

7 వ సారి విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం
ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం కోసం ప్రజలపై భారమా ?
వైసీపీ సర్కార్ పేదలపై భారం మోపడం అన్యాయం
విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండింస్తున్నా – తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్

నంద్యాల (పల్లెవెలుగు) 04 ఏప్రిల్: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడం ఇది 7వ సారి అని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్  ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ బిల్లులు షాక్ కొట్టేలా పెంచారని మండిపడ్డారు. ఒక పక్క 1 కరెంటు కోతలతో జనం అల్లాడుతుంటే  వైసీపీ ప్రభుత్వం పేదలపై విద్యుత్ చార్జీల భారం మోపడం అన్యాయం అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎండలు మండుతుంటే విద్యుత్ వాడకం తగ్గించుకోవాలనడం. జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం కోసం, నమ్మి ఓట్లు వేసిన ప్రజలపై భారం మోపి, ప్రజలను బాధ పెడతారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75  యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ .1.40 పైసలు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ .8.75 పైసలు పెంచారని అన్నారు. ఇక 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ.9.75 పైసలు ఈ ప్రభుత్వం ఛార్జీలను పెంచింది అంటే, రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వానికి ఎంత ద్వేషం ఉందో 1 ప్రజలందరికి అర్థం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి, పెట్రోల్, డీజిల్ పై టాక్స్ ఎక్కువగా వేసి ప్రజలపై భారం మోపడమే కాకుండా 1 ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపి, ప్రజలకు ఉగాది కానుకగా అధిక చార్జీల  భారాన్ని ప్రజలు ఇచ్చారు. అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో  రాష్ట్రంలో – సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతు న్న సామాన్యులపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం అన్యాయం అని దుయ్యబట్టారు . పరిపాలన చేతకాక వ్యవస్థలన్నిటినీ దిగజార్చి , ఆర్థికంగా కుదేలు చేసి ఇప్పుడా భారాన్ని ప్రజల మీద వేయడం ఎంత దుర్మాం మన్నారు . ఆర్టీసీ బస్సు చార్జీలు , పెట్రోలు చార్జీలు , ఫైబర్ గ్రిడ్ చార్జీలు , ఇప్పుడు ! విద్యుత్ చార్జీలు సామా న్యుడి మీద ఏంటీ ఆర్థిక భారం ? అని విమర్శించారు . గత మాటీడీపీ హయా •ంలో భవిషత్తులో కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాట నిలబెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అని ! గుర్తుచేశారు . చార్జీలు పెంచం అని నమ్మించి మోసంచేసింది వైసీపీ అని మండిపడ్డారు . ఒక్కఛాన్స్ ఇమ్మని ప్రజలు కాళ్ళు గడ్డాలు పట్టుకుని , అధికారం లోకి వచ్చి , ఇలా మోయలేని భారాలు ప్రజలపై వేసేందుకేనా ? ఇదేనా మీ విశ్వసనీయత ? ఇది నయవంచన కాదా ? అని ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు . వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే వారు తెలియజేశారు

Back to top button