NandyalAbdul Javid

250 మంది పేద ముస్లింలకు ‘రమజాన్ కిట్లు’ పంపిణీ

250 మంది పేద ముస్లింలకు ‘రమజాన్ కిట్లు’ పంపిణీ

నంద్యాల (పల్లెవెలుగు) 03 ఏప్రిల్: ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గుర్తించిన 250 పేద ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి వెయ్యి విలువగల రెండు లక్షల యాభై వేల రూపాయల రంజాన్ కిట్లు జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ పంపిణి చేసారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ జమాఆతె ఇస్లామి సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ సేవలు నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం సభ్యులు, కార్యకర్తలు వితరణ వల్ల గుర్తించిన పేదవారికి ఇంటివద్దకు కూడ జమాత్ కార్యకర్తలు నిత్యావసర సరుకులు చేర్చారన్నారు. రమజాన్ లో పేద వారు ఉపవాసాలు ఉండి పనులు లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయని, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవడంలో జమాత్ ముందుంటుందని తెలిపారు. కరోనా కాలంలో సైతం జమాతే ఇస్లామి సేవలు సమద్ గుర్తు చేసారు. ఒక్కో కిట్టు లో బియ్యం, కింది బేడీలు, చింతపండు, మంచి నూనె లాంటి 9వస్తువులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీ.యం.జకరియా, అబ్దుల్ ఖాదర్ జీలాని, ఫయాజ్, పీవి షాహిద్, జమా, రషీద్, అలీం, ఫజ్లే హఖ్, మహబూబ్బషా, సద్దాం,తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks