NandyalAbdul Javid

 హిందూ సోదరులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు రంజాన్ క చాంద్ ముబారక్ – NMJAC

 హిందూ సోదరులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు రంజాన్ క చాంద్ ముబారక్ – NMJAC

నంద్యాల (పల్లెవెలుగు) 03 ఏప్రిల్: నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు అబూలైస్ మాట్లాడుతూ నంద్యాల హిందూ సోదరులకు అందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ముస్లిం సోదరులందరికీ రంజాన్ చాంద్ ముబారక్ తెలుపుతూ దేశంలోని ప్రజలందరూ కులమతాల కతీతంగా సోదరభావంతో కలిసి మెలిసి దేశ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రాలను అవసరం ఉన్న పేదవారికి ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ప్రజల కోరిక మేరకు పాణ్యం, గడివేముల మండలాలు నంద్యాల జిల్లాలో కలపడం ఆనందకరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించడం  మరియు ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేయడం చాలా సంతోషకరం అని అన్నారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఉగాది పండుగ మరియు రంజాన్ నెలవంక ఒకేరోజు కనబడడం చాలా సంతోషకరం రేపు 04వ తేదీన నంద్యాలను జిల్లాగా అధికారికంగా ముస్తాబవుతుంది. ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించిన ప్రభుత్వం. నూతన జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఉర్దూ భాష లో  పేర్లు పెట్టలేదు ఉర్దూ భాష పై ప్రకటనలే కాకుండా అమలులో తెచ్చి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఉర్దూ భాషలో కూడా పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా, గన్ని హబీబ్, జుబేర్, నవాజ్ ఖాన్, సద్దాం, కరీముల్లా, మస్తాన్ ఖాన్ పాల్గొన్నారు

Back to top button