NandyalAbdul Javid

రంజాన్ కిట్ పంపిణీ 

రంజాన్ కిట్ పంపిణీ

నంద్యాల (పల్లెవెలుగు) 3 ఏప్రిల్:  ఆత్మకూరు బస్టాండ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ హెడ్ ఆఫీస్ లో నిరుపేద కుటుంబాలకు వితంతువులకు రంజాన్ ఉపవాసం ఉండేవారికి ఎనిమిది వందల రూపాయల రేషన్ సరుకులు మరియు కూరగాయల కొరకు రెండు వందల రూపాయలు నగదు కర్నూలు జిల్లా iuml ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ మరియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల సలాం ఆధ్వర్యంలో 20 మందికి ఇవ్వడం జరిగింది ఒక్క కిట్టు వెయ్యి రూపాయల చొప్పున తయారు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎస్ ఎం ఢి ఉమర్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ జాకీర్ హుస్సేన్, నూర్ భాషా జాయింట్ సెక్రెటరీ ఇబ్రహీం రఫీ పాల్గొన్నారు.  మౌలానా అబ్దుల్ సలాం మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ లో చాలామంది బీద వాళ్ళు సహరిమరియు ఇఫ్తార్ కొరకు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళ కొరకు ఐయు ఎమ్ ఎల్ ఆదుకుంటుంది. అని చెప్పారు మరియు రంజాన్ పండుగకు 500 కిట్లు తయారు చేస్తున్నామని చెప్పారు మరియు ప్రతి ఒక్కరూ తన చుట్టుపక్కల ఉన్న వారి గురించి ఆలోచించాలి వారి కష్టాలను గ్రహించి ఆ కష్టాలను దూరం చేయడం కొరకు కష్టపడాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు

Back to top button