NandyalAbdul Javid

పట్టణ ప్రముఖులను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జమాఆతె ఇస్లామీ నాయకులు

పట్టణ ప్రముఖులను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జమాఆతె ఇస్లామీ నాయకులు

నంద్యాల (పల్లెవెలుగు) 2 ఏప్రిల్: తెలుగు సంవత్సరాది  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రముఖులకు తెలుపుతూ జమాఆతె ఇస్లామీయ హింద్ నంద్యాల శాఖవారు చక్కటి తెలుగులో బహుచక్కటి భావంతో గ్రీటింగ్స్ పంచారు. ఈ సందర్భంగా నంద్యాల జమాత్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉగాది గ్రీటింగ్స్ పంపిణీ చేస్తున్నామని ఈ నేపథ్యంలో నంద్యాలలో శ్రీ శుభకృత్ నామ ఉగాది గ్రీటీంగ్స్ 1వ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లకు, కాంగ్రేస్ నియోజక వర్గ ఇంచార్జీ చింతల మోహనరావు, మున్సిపల్ కౌన్సిలర్ మరియు ప్రముఖ జర్నలిస్టు కె.శ్యాం సుందర్ లాల్, సిరి స్టోర్స్ అధినేత సుబ్బయ్య, కౌన్సిలర్ దేశం సులోచన, విమలమ్మ తదితర వ్యాపారులకు, పూజారులకు, అడ్వకేట్ లకు  శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం జమాత్ మంచి సందేశంతో దేశ ఐక్యత, పరస్పర సోదరభావం పెంపొందించుకుని తనవంతు కృషి చేస్తుందని రేపు  కూడ గ్రీటింగ్స్ పంచుతామని, గ్రీటింగ్స్ కు ఆప్యాయతతో ప్రజలు ఆదరిస్తున్నారు సమద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సలీం, పెన్నాల షఫీ, నవాజ్ ఖాన్, ముహమ్మద్ ఫయాజ్, మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks