NandyalMani News

చలివేంద్రం ప్రారంభం

చలివేంద్రం ప్రారంభం

నంద్యాల  (పల్లెవెలుగు) 02 ఏప్రిల్: శాసనసభ సభ్యులు శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి  ఆదేశాలు మేరకు పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ తబ్రేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం చలేవేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మునిసిపల్ చైర్మన్ షేక్ మాబునిసా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ సమద్, వైకాపా నాయకులు గోపాల్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తబ్రేజ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా చలేవేంద్రాన్ని నడుపుతున్నామని, వార్డ్ లో 2 చోట్ల ఉంచడం జరిగిందని, ప్రతి ఆదివారం మజ్జిగ, కూల్ డ్రింక్స్ తదితర వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు నాగపుల్లయ్య, రవి, రసూల్, సలాం మరియు వార్డ్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks