NandyalAbdul Javid

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

  • పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
  • ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తప్పదు
  • విద్యుత్ బిల్లుల పెంపు ప్రతిపాదనను ఉపసహరించుకోవాలి. – కరోనా కాలంలో ప్రజలపై భారాలు మోపుతారా ?

నంద్యాల (పల్లెవెలుగు) 31 మర్చి: కరోనా కష్టాల నుంచి ప్రజలు గట్టిక్కక ముందే భారీగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు రెగ్యులేటర్ కమిషన్ ప్రతిపాదనలు చేయడం, ఆఘమేఘాలపై అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం దుర్మార్గమని సీపీఐ(ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ఎస్.ఎండి.రఫీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నాడు స్థానిక శ్రీనివాస్ సెంటర్ నందు ఫకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ఎస్.ఎండి రఫీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగించాలని, లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ షాక్. తగులుతుందని ఆయన హెచ్చరించారు.  పండుగ కానుకగా ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి ప్రకటనలు ఆశిస్తున్నారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం అనూహ్యంగా విద్యుత్ చార్జీలను పెంచి భారాలను మోపేందుకు సిద్ధమైందని విమర్శించారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో ఫ్యాన్ వేసే విద్యుత్ షాక్ కొట్టే పరిస్థితిని తీసుకొస్తోందన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీలు పెంచవద్దని, సామాన్యులపై భారాలు మోపవద్దని ప్రజలు, వామపక్ష పార్టీలు స్పష్టంగా చెప్పాయని తెలిపారు. అయినా, ఇప్పటివరకు ఉన్న 13 శ్లాబులను 6 స్లాబులకు కుదించి భారీ దోపిడీకి తెరతీశారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాట తప్పి మడమ తిప్పి కరోనా కష్టాల్లో ప్రజలు -పనుల్లేక అల్లాడుతున్న తరుణంలోనే ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో రూ.400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మళ్లీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్న సమయంలో చార్జీలు పెంచాలని ప్రయత్నించడం దుర్మార్ధమన్నాడు. విద్యుత్ పంపిణీ సంస్థలు లాభాల బాటలో ఉన్నాయని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ప్రజల నుంచి వసూలు చేస్తున్న చార్జి వాస్తవ పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యుత్ స్లాబుల కుదింపు, బిల్లుల పెంపు ప్రాతిపాదనను ఉ పసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగిలేలా చేస్తామని హెచ్చరించారు. ”ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు డివిజన్ ఉపాధ్యక్షుడు ఫరూక్,అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ నాయకులు అల్లబకాష్,పిడి ఎస్ యు డివిజన్ కార్యదర్శి నవీన్ కుమార్, నాయకులు రవి, వంశీ, హరి, వినయ్, నాయక్, బాలు, కృష్ణారెడ్డి, మోహన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Back to top button