NandyalAbdul Javid

మదర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదానం

మదర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదానం

నంద్యాల  (పల్లెవెలుగు) 29 మర్చి: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జోమోటో మూడు సంవత్సరములు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పని చేసే డెలివరీ బాయ్స్ 20 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి మాట్లాడుతూ  జోమోటో కంపెనీ వారు నంద్యాల ప్రజలు ఆర్డర్ చేసిన వెంటనే మీకు అందించడంలో తోడ్పడుతున్నారు. అలాగే ఈ రోజు రక్త దానం చేయడం వల్ల ఎంతోమంది ఆపదలో ఉన్న సమయాలలో ప్రాణాలు కాపాడవచ్చు అని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో రక్తదానం చేయడం వలన పేద ప్రజలకు ఉచితంగా అందుతుందని ఈ ఎండాకాలంలో బ్లడ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దృష్టిలో ఉంచుకుని వారు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయమని ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో తేజ. బసవరాజు . ప్రసాద్ . కరీముల్లా. మధు. సాయి. అంజి. సురేష్. పాల్గొన్నారు

Back to top button