NandyalAbdul Javid

డాక్టర్ తలారి రంగయ్య ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన – వాల్మీకి సంఘ నేతలు

డాక్టర్ తలారి రంగయ్య ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన – వాల్మీకి సంఘ నేతలు

నంద్యాల (పల్లెవెలుగు) 29 మర్చి: అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య చిత్తూరు,  ఎంపీ రెడ్డెప్ప మరియు హిందూపూర్ ఎంపీ మాధవ్ తో కలిసి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీమతి రేణుకసింగ్ ని ఢిల్లీ లోని వారి నివాస కార్యాలయంలో కలిసి బోయల చిరకాల కోరిక St పునరుద్ధరణ అంశాన్ని ఇతర రాష్ట్రాలలో బోయలు పొందుతున్న రిజర్వేషన్స్, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2017 లో చేసిన తీర్మానం గురించి తెలిపి న్యాయం చెయ్యాలని కోరడం పట్ల వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న, నంద్యాల పార్లమెంట్ గౌరవాద్యక్షులు గుర్రప్ప, పార్లమెంట్ న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బారాయుడు, విఆర్పీఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు పరమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  స్థానిక నంద్యాలలోని  కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి 3 సంవత్సరాలైందని ముఖ్యమంత్రి మొత్తం పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రధానిని కలిసి త్వరగా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా కృషి చెయ్యాలని  , ఇచ్చిన హామీని నిలుపుకోవాలంటే వాల్మీకుల st పునరుద్ధరణ బిల్లు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింప చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో  యువనేతలు వెంకటేశ్వర్లు, నాగేంద్ర, శివనాగేంద్ర, సందీప్, ఉద్యోగ సంఘ నేతలు రవిప్రకాష్ నాయుడు, శ్రీనివాసులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button