NandyalAbdul Javid

దేశంలో ప్రజాస్వామ్య విలువలు కు భంగం వాటిల్లే విధముగా పాలన సాగుతున్నది – రామక్రిష్ణ రెడ్డి

దేశంలో ప్రజాస్వామ్య విలువలు కు భంగం వాటిల్లే విధముగా పాలన సాగుతున్నది – రామక్రిష్ణ రెడ్డి

నంద్యాల (పల్లెవెలుగు) 26 మర్చి:  పట్టణములోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కర్నూలు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్య వర్గ సమావేశం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల  రహీం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రామక్రిష్ణ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ జిల్లా కార్యవర్గ సమావేశం లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 25 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథి రాష్ట్ర అద్యక్షులు రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలు కు భంగం వాటిల్లే విధముగా పాలన సాగుతున్నది అని దీనిని కాపాడవలసిన బాధ్యత భారత దేశం లోని ప్రతి పౌరుడి భాధ్యత అని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ సభలు నందు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సక్రమముగా అమలు చేసుకోవడంలో పౌరుడు నిర్ణయాలు తీసుకొని అమలు చేసుకున్నప్పుడే ప్రజా స్వామ్య ము సక్రమంగా అమలు అయినది అని భావించాలి. అందుకే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రజలకు గ్రామ సభలు మరియు వార్డు సభలు పైన శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు రహీమ్ మాట్లాడుతూ ఎప్రిల్ నెల 14వ తేదీ నుంచి జరుగబోయే గ్రామ సభలు జిల్లాలోని అన్ని గ్రామాలలో సక్రమంగా జరిగే విధముగా మన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రతి సభ్యుడు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలోని ప్రతి గ్రామములో గ్రామ సభ జరిగే విధముగా గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులు కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మండల జిల్లా స్థాయి అధికారులకు ఉచితముగా గ్రామ సభలు పైన అవగాహన శిక్షణ ఇవ్వడానికి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక పెద్దలు సిద్దముగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామక్రిష్ణ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామ్ ,నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , పట్టణ కోశాధికారి డీపీ మస్తాన్ వలీ, ఉపాధ్యక్షులు చెనా రెడ్డి, నాబిరసోల్, కర్నూలు నగర అధ్యక్షుడు రవి కుమార్, నంద్యాల మండల అధ్యక్షులు ఉమా మహేష్ ,ఉపాధ్యక్షులు శివ నారాయణ ,బండి ఆత్మకూరు మండలం అధ్యక్షులు సంపంగి రామ రాజు, నగకంత్ రెడ్డి, మహిళా విభాగం నుంచి శ్రీమతి వాహిధః తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks