NandyalAbdul Javid

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు మార్పు దారుణం – గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు మార్పు దారుణం – గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 424 బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ కేటగిరి కి మార్చడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు ఏ వర్గాలకు చెందితే ఆ వర్గాలకు కేటాయించాలని కోరారు. శనివారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో పాత్రికేయులతో ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 424 బ్యాక్ లాగ్ పోస్టులను జనరల్ గా మార్పు చేశారు అంటూ వార్త పత్రికలో కథనాలు వెలువడ్డాయని, అన్నారు రిజర్వుడ్ కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేరని పేర్కొనడం అన్యాయమని అనేక అర్హతలు కలిగిన ఎస్సి, ఎస్టి నిరుద్యోగ అభ్యర్థులు తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అలాంటి హక్కు కలిగిన బ్యాక్లాగ్ పోస్టులను ఏ కారణం చేత ఎందుకు జనరల్ కేటగిరీలోకి మార్పు చేశారో రాష్ట్రంలో ఉన్న గిరిజన యువకులకు అర్థం కావడం లేదని అన్నారు. వెంటనే సదరు బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా చేయకపోతే ఎస్సీ ఎస్టీ యువకులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత గిరిజనులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని విన్నవించారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ విజయ్ నాయక్, యువజన నాయకులు విక్రమ్ నాయక్, చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks