NandyalAbdul Javid

విద్యార్ధిని మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసిపి నాయకుడ్ని కఠినంగా శిక్షించాలి

విద్యార్ధిని మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసిపి నాయకుడ్ని కఠినంగా శిక్షించాలి

– టిడిపి మైనార్టీ నాయకులు జీఎం గౌస్

నంద్యాల (పల్లెవెలుగు) 24 మర్చి: చిత్తూరు జిల్లా పలమనేరులో మహర్షి పాఠశాలలో మిస్బా, పూజిత చదువులో పోటీ పడేవారని అయితే పూజిత వాళ్ళ తండ్రి సునీల్ అధికార పార్టీ నాయకుడు కావడంతో తన కూతురు చదువులో ముందుండాలని మిస్బాను మీ తండ్రి సోడా అమ్ముకొని జీవనం నడిపే వ్యక్తి అంటూ హేళన చేసారు. పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ కూడ మిస్బాను వేధింపులకు గురి చేసాడని తనను వేరే పాఠశాలకు కూడా తరలించారని మిస్బా తల్లి చెప్పిందన్నారు. దీంతో మనస్తవానికి గురైన మిస్బా తన చావుకు ప్రిన్సిపల్ రమేష్, వైసీపీ పార్టీ నాయకుడు సునీల్, తన సహ విద్యార్థిని పూజిత అని  సూసైడ్ లెటర్ లో పేర్లు రాసిఆత్మహత్య చేసుకుందని, మిస్బా చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A లో అందరికి విద్య సమాన హక్కుగా పరిగణించబడిందని, కానీ అధికార పార్టీ నాయకుడు సునీల్ తన కూతురి స్వార్థం కోసం, ప్రిన్సిపల్ రమేష్ తో కలిసి మిస్బాను వేధింపులకు గురి చేయడం ఆర్టికల్ 21A ఉల్లంఘనగా భావించి సునీల్ మరియు రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉవైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మైనారిటీలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుండి మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని, అధికార బలంతో వైసీపీ నాయకులే మైనారిటీలను వేధిస్తున్నారని పేర్కొన్నారు.

Back to top button