
నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం
నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం
నంద్యాల (పల్లెవెలుగు) 23 మర్చి: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఉన్న “సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ షేక్ షహనాజ్, షేక్ సర్దార్ బాషా గార్ల ముద్దుల కూతురు మహిదియ పుట్టినరోజు పురస్కరించుకొని” నంద్యాల చాబోలు గ్రామంలో నివాసం ఉన్న మంగలి పాములేటి పక్షవాతంతో మంచానికి అంకితం అయి తన చేతి వృత్తి ఉపాధి కోల్పోవడంతో అతని ఇబ్బంది గమనించి నంద్యాల మదర్ యూత్ అసోసియేషన్ ఒంగోలులోని సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది. ఇంకా దాతలు ముందుకు వచ్చి పక్షవాతంతో బాధపడుతున్న మంగలి పాములేటి కి సహాయ సహకారాలు అందించవలసిందిగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యుడు హుస్సేన్ వలి పాల్గొన్నారు.