Nandyal

ఆత్మకూరు డివిజన్ ను షెడ్యూల్ ట్రైబల్ జోన్ గా మార్చాలి

ఆత్మకూరు డివిజన్ ను షెడ్యూల్ ట్రైబల్ జోన్ గా మార్చాలి

ఆత్మకూరు డివిజన్ ను ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించి ప్రభుత్వం నామకరణ చేయాలి…. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

నంద్యాల (పల్లెవెలుగు) 21 మర్చి: జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలో నివసిస్తున్న అత్మకూరు డివిజన్ ను షెడ్యూల్ ట్రైబల్ డివిజన్ గా ఏర్పాటు చేసి  ప్రభుత్వమే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరు మీద నామకరణం  చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు  కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంట్ నియోజక వర్గానికి జిల్లా చేసిన విషయం అందరికి తెలిసిందే ఆత్మకూరును డివిజన్ గా ఏర్పాటు చేస్తున్న సంధర్భంగా ఈ డివిజన్ నీ ఆత్మకూరు షెడ్యూల్ ట్రైబల్ డివిజన్ చేసి గిరిజన ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించాలని వారు కోరారు.ఆత్మకూరు గిరిజన డివిజన్ గా నామకరణం చేసి  గిరిజనులకు అన్ని రకాల అభివృధి చేయాలనీ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ ప్రాంతంలో బంజారాలు(సుగాలి), చెంచులు, యానాదులు, ఎరుకల  అత్యధికంగా పేదరికంలో అతి పేదరికం జాబితాలో నివసిస్తున్నారని అన్నారు. కల్వకుర్తి నుండీ నంద్యాల వరకు ఏర్పడుతున్న ఈ నూతన రోడ్డు  మార్గంలో  ఆత్మకూరు వద్ద  సిద్ధేశ్వరము నుండి నంద్యాల వరకు గల రోడ్డు మార్గంలో గిరిజన జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సున్నిపెంట గిరిజన మండలము గా కృష్ణా నది పై కట్టే వంతెన పేరు ” చెంచు లక్ష్మి అని నామకరణం చేయాలి. ఆత్మకూరు సర్కిల్లోని సేవాలాల్ సెంటర్ గా పేరు పెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. చెంచు లక్ష్మి, ఏకలవ్య, సేవాలాల్ మహారాజ్ మా గిరిజన దేవి దేవతలు మరియూ దర్మగురువులు.Dr  అంబేడ్కర్,  వెన్నలకంటి రాఘవయ్య, వడితే గోపాల రావు, పాలపర్తి వీరయ్య, తిరువీధుల సాంబయ్య వీళ్ళు మాకు రిజర్వేషన్ తెచ్చిన వారు కావున ఈ ప్రాంతంలో మా గిరిజన ధర్మ గురువుల, జాతీయ గిరిజన సంఘ సంస్కర్తల విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలి, ఈ ప్రాంతంలో అధిక శాతం గిరిజనులు నిరక్షరాస్యులు, నిరుద్యోగులుగా ఉన్నారు. గిరిజన గ్రామాల్లో నేటికీ సరైన సదుపాయాలు, గృహాలు, తాగునీరు, రహదారి సౌకర్యాలు లేవు. కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈడివిజన్లో అడవి బిడ్డలు గానే కొనసాగుతున్నారు. శ్రీశైలం వెళ్లే మార్గ మధ్యలో మంతనాలమ్మ అమ్మవారికి ఎంతో మంది గిరిజన భక్తులు దర్శించుకోడానికి వస్తుంటారని ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. కొంత ప్రాంతం ఏజెన్సీద్వారాఅభివృధిజరుగుతున్నది. మిగతా మైదాన ప్రాంతానికీ  ఏజెన్సీలో కలపడమో లేక ఈ డివిజన్ కి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి నోడల్ ఏజెన్సీ ద్వారా అభివద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆత్మకూరు కొత్త డివిజన్ ఏర్పాటులో భాగంగా భౌగోళికంగా ఉన్న  ఈ అత్మకురును నంద్యాల జిల్లాలో కొనసాగించాలని ఆత్మకూరు షెడ్యూల్ ట్రైబల్ డివిజన్గా గుర్తించి అభివృధి చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో , జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, చంద్ర నాయక్, సురేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు

Back to top button