NandyalAbdul Javid

పిల్లలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం

పిల్లలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం

నంద్యాల (పల్లెవెలుగు) 20 మర్చి: ఉష మనో వికాస్ కేంద్రం నంద్యాలలోని శ్యాంకాలువ వైఎస్ఆర్ విగ్రహం సర్కిల్ నందు కల్పనా రెడ్డి హాస్పిటల్ కి ఎదురుగా పూన: ప్రారంభించారు. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవసమాజ ఫెడరేషన్ ఆర్గనైజేషన్(NSF) యూత్ వింగ్ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ ఉష మనో వికాస్ కేంద్రానికి నిత్యావసర సరుకులు అందించారు. ఉషా మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు ప్రిన్సిపాల్ ఉష మాట్లాడుతూ మానసిక పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించి, వారు స్వయంగా తమ కార్యకలాపాలు  చేసుకునే విధంగా మంచి శిక్షణ ఈ కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు. మరియు నంద్యాలలోని దాతలు ముందుకు వచ్చి మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు, మీ పెద్దవారి జ్ఞాపకార్థంలు, శుభకార్యాలు ఈ పిల్లల మధ్యలో జరుపుకొని వారితో మీయొక్క సంతోషాన్ని పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి మాట్లాడుతూ మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు ఉష మనోవికాస్  కేంద్రంలోని పిల్లల మధ్యలో జరుపుకొని అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా కోరారు.  ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యుడు హుస్సేన్ వలి, నవసమాజ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks