NandyalAbdul Javid

తాగడానికి నీళ్లు లేక పోయినా నాటు సారాయి, నకిలీ మద్యం విచ్చలవిడిగా లభిస్తున్న రాష్ట్రం – ఆంధ్రరాష్ట్రం –  టిడిపి మైనార్టీ నాయకులు జీఎం గౌస్

తాగడానికి నీళ్లు లేక పోయినా నాటు సారాయి, నకిలీ మద్యం విచ్చలవిడిగా లభిస్తున్న రాష్ట్రం – ఆంధ్రరాష్ట్రం –  టిడిపి మైనార్టీ నాయకులు జీఎం గౌస్

నంద్యాల (పల్లెవెలుగు) 20 మర్చి: తాగడానికి నీళ్లు లేక పోయినా నాటు సారాయి, నకిలీ మద్యం విచ్చలవిడిగా లభిస్తున్న రాష్ట్రం – ఆంధ్రరాష్ట్రం అని ఆదివారం విలేకరుల సమావేశం లో  టిడిపి మైనార్టీ నాయకులు జీఎం గౌస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నాటుసారా, జె బ్రాండ్ మద్యం పేద మహిళల తాళిబొట్లు తెంచేవిదంగ వైసీపీ ప్రభుత్వం పేదలపై పగ పట్టిందని పారిశ్రామిక వేత్త, టిడిపి మైనార్టీ నాయకులు జీఎం గౌస్ విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నాటు సారా తయారీ కేంద్రాలు ఆదాయ వనరుగా మారిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కాసుల కక్కుర్తితో నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ పేదల ప్రాణాన్ని బలి పెట్టి తమ జె బ్రాండ్ సొమ్ముతో జేబులు నింపుకుంటున్నాన్నారు. వైసిపి నాయకులు తమ సొంత బ్రాండ్ లతో తమజేబులు నింపుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా విక్రయించి పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు విచ్చలవిడిగా నాటు సారాయి తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీనాటు సారా తాగి 25 మంది మృతి చెందడం దారుణమని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు తమ తాళిబొట్టు లను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఒక దుర్గామాతగా విజృంభించి పోరాటాలు చేయాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ నాటు సారాయి నకిలీ జె బ్రాండ్లతో లక్షలాది మంది మద్యం ప్రియులు ఆరోగ్యాలు దెబ్బతిని మంచాన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు జే బ్రాండ్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Back to top button
Enable Notifications    OK No thanks