NandyalAbdul Javid

ఉత్తమ ప్రతిభ కు ఘన సత్కారం

ఉత్తమ ప్రతిభ కు ఘన సత్కారం

నంద్యాల (పల్లెవెలుగు) 18 మర్చి: ఈ నెల 13వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగిన రాష్టస్థ్రాయి బాడీ బిల్డింగ్ పోటీలలో 2.3.4 స్థానాల్లో ప్రతిభ కనబర్చిన నంద్యాల యువకులను తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది.  ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో నంద్యాల యువకులు పేరు ప్రఖ్యాతలు సాధించడం చాలా గర్వించదగ్గ విషయమని వారిని ప్రోత్సహించడం కోసమే వారికి సన్మానం చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రీడలను మరియ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఎటువంటి ప్రోత్సాహం లభించకపోవడం చాలా దారుణమన్నారు ప్రతిభావంతులైన వారిని గుర్తించి తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదేక్రమంలో త్వరలో మన నంద్యాల పట్టణంలో కూడా రాష్టస్థ్రాయి బాడీ బిల్డింగ్ పోటీలను సొంత ఖర్చులతో నిర్వహిస్తామని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాడీలైన్ జిమ్ నిర్వాహకులు ఖ్వాజా మోహిద్దీన్ తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ కార్యదర్శులు నస్యం షాకిర్,  సుహైల్ రానా,  టీడీపీ యువ నాయకులు రాజేష్ (బుజ్జి) అక్బర్,  సైలబ్, మైనార్టీ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks