Nandyal

హిజాబ్ గురించి ఖురాన్ లో ఉంది

హిజాబ్ గురించి ఖురాన్ లో ఉంది

నంద్యాలలోని  మస్జిద్ నూరే ఖాదరియా జరిగిన సమావేశంలో జానో జాగో జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ముస్లిం మత పెద్దలు మౌలానా అబ్దుల్ సలాం, రఫీ ఉద్దీన్ మౌలానా లు మాట్లాడుతూ హిజాబ్ పై మొన్న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు హిజాబ్ గురించి ఖురాన్ లో లేదని ఇస్లాంలో లేదని హైకోర్టు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు కానీ ఇస్లాం లో హిజాబ్ గురించి అలాగే ఖురాన్ లో కూడా ఉందని వారన్నారు. ఈ సందర్భంగా వారు ఖురాన్ లోని హిజాబ్ గురించి ఖూరాన్ లోని పారా 18 కాద్ ఆఫ్ లహ సూరత్ నూర్. ఆయత్ 31.  మరియు  పార 22. ఓ మై ఈ క్ నుత్ . ఆయత్ 59 చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తులు ముస్లిం మత పెద్దలతో సమావేశమై ఖురాన్ గురించి చర్చించాలని ఖురాన్ లో హిజాబ్ గురించి పై చెప్పబడిన వ్యాఖ్యలు ఉన్నాయని కాబట్టి తీరుపై పునరాలోచన చేయాలని వారన్నారు అలాగే రాజ్యాంగం కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మత స్వేచ్ఛ హక్కు కల్పించిందని అన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks