NandyalAbdul Javid

ముస్లిం ల సమస్యలను పరిష్కరించాలి

ముస్లిం ల సమస్యలను పరిష్కరించాలి

నంద్యాల (పల్లెవెలుగు) 11 మర్చి: నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (NMJAC) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జనాబ్ S.Md.అబూలైస్, జనాబ్ S. అబ్దుల్ సమద్ ల ఆధ్వర్యంలో గురువారం మర్చి 10 వతేదీ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, (వెలగపూడి) అమరావతి, విజయవాడ లకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సి ఫారూఖ్, ఎమ్మెల్సి  సి. ఇసాక్ బాష లను కలిసి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలలో తమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

  1. ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి పార్టీ మేనిఫెస్టో ప్రకారం
  2. ముస్లింలకు సబ్ప్లాన్ అమలు చేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించిన బడ్జెట్ ను వారి కే వినియోగించాలి.
  3. దుల్హన్ పథకం అమలు చేసి పేద ముస్లిం మహిళల వివాహాలకు సహాయపడాలి.
  4. మైనారిటీ ముస్లిం పేద పిల్లల విదేశీ ఉన్నత విద్యకు సహాయం చేయాలి.
  5. ఇస్లామిక్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
  6. గత డీఎస్సీ లలో నియామకం జరగక ఖాళీగా ఉన్న ఉర్దూ బ్యాక్లాగ్ పోస్టులను  డీరిజర్వ్ చేసి, డీఎస్సీకి క్వాలిఫై ఐ నిరుద్యోగులుగా ఉన్న మైనారిటీ ఉపాధ్యాయులను నియమించాలి.
  7. పి.ఎమ్.జె .వి. వై క్రింద కేటాయించబడిన ఆరు భవనాలకు స్థల కేటాయింపు చేసి త్వరితగతిన భవన నిర్మాణాలను చేపట్టాలి.
  8. పాణ్యం, గడివేముల, మండలాలను నంద్యాల జిల్లాకు కేటాయించడం ద్వారా నంద్యాల జిల్లాకు జరిగే అపారనష్టాన్ని నివారించాలి.
  9. గతం లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులమేరకు రాష్ట్రవ్యాప్తంగా అప్గ్రేడ్ చేసిన 220 ఉర్దూ ప్రాథమిక పాఠశాలల లో ఒక్కో పాఠశాలలో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లను, ఆ విధంగా 660 మంది స్కూల్ అసిస్టెంట్లలను, 70% పదోన్నతుల ద్వారా 30% DSC ద్వారా వెంటనే నియమించి ఉర్దూ భాషను కాపాడాలి

ఈ కార్యక్రమంలో లో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులైన గన్నీ కరీం, సుహైల్ రానా, కాంట్రాక్టర్ అబ్దుల్లా, కోహినూర్ మహబూబ్ బాషా, నవాజ్ ఖాన్, మహబూబ్ బాషా, గన్ని హబీబుల్లా,  జుబైర్ బాష, S.అలీం తదితరులు పాల్గొన్నారు.

Back to top button