Nandyal

అస్వస్థత గురైన బాల బాలికలను పరామర్శించిన  కాంగ్రెస్ పార్టీ నాయకులు

అస్వస్థత గురైన బాల బాలికలను పరామర్శించిన  కాంగ్రెస్ పార్టీ నాయకులు

నంద్యాల (పల్లెవెలుగు) 11 మర్చి: పట్టణంలోని విశ్వనగర్ ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల యందు మధ్యాహ్నం భోజనము వికటించి అస్వస్థతకు గురైన 42 మంది బాల బాలికలలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఊకోట్టు వాసు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజనం పథకంలో సరైన నాణ్యతలేని గుడ్లు. చెక్కలు. ఏ సందర్భంలో ఇవ్వాలో తెలియక ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చిన మధ్యాహ్న భోజనములో పొంగలి. గుడ్డు ఇవ్వడం వల్ల చిన్నపిల్లలుతిని అస్వస్థతకు గురవడం బాధాకరమని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్నం భోజనం పథకం పనిచేస్తున్న వారికి అవగాహన కల్పించడంలో వైఫల్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మధ్యాహ్న భోజనం పథకం లో సక్రమంగా అమలు చేసి పిల్లలను కాపాడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని పై నాయకులు మధ్యాహ్న భోజనం నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. అ స్వస్థతగురైన బాలికలను పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఫరూక్  జాకిర్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ SYD.ప్రసాద్,  వెంకటేష్ ఆనంద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Back to top button