NandyalAbdul Javid

నాణ్యత లేని గోరుముద్ద పై సమగ్ర విచారణకు అదేశించాలి ఎన్.ఎమ్.డి ఫిరోజ్

నాణ్యత లేని గోరుముద్ద పై సమగ్ర విచారణకు అదేశించాలి ఎన్.ఎమ్.డి ఫిరోజ్

నంద్యాల (పల్లెవెలుగు) 11 మర్చి:  పట్టణంలోని స్థానిక విశ్వనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల నందు గోరుముద్ద పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని నాసిరకం భోజనం వడ్డించడం వలనే దాదాపు 40 మంది  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుగు దేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి  ఎన్.ఎమ్.డి ఫిరోజ్ పేర్కొన్నారు. సమాచారం వచ్చిన వెంటనే హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను అరతీయగా పిల్లలు ప్రతి మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే వాంతులు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వం గోరుముద్ద అంటూ ప్రచారంలో చూపిస్తున్న నాణ్యత పిల్లలకు అందించే భోజనంలో చూపించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పిల్లలు ఉదయం ఆరోగ్యంగా పాఠశాలకు వచ్చి మధ్యానానికే ఇలా అనారోగ్యం పాలు కావడం తల్లి తండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారని గోరుముద్ద పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ క్షేత్రస్థాయిలో దీనిపై సమగ్ర విచారకు అదేశించాలన్నారు  ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సంఘటన కు కారకులైన వారిని తక్షణం విధుల నుండి తొలగించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శులు నస్యం షాకిర్, సుహైల్ రానా,  నాయకులు అక్బర్. సర్దార్ మాహబూబ్ బాషా, బీరువ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు

Back to top button