NandyalAbdul Javid

ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

 నంద్యాల (పల్లెవెలుగు) 11 మర్చి: ప్రతిష్ఠాత్మకమైన ఒలంపియాడ్ లో నంద్యాలలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య పాఠశాల – ఎన్ 2 విద్యార్థులు ప్రతిభ చాటారు. బహుమతులను కైవసం చేసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ మొదటి దశలో ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య పాఠశాల కు చెందిన 90 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆమె తెలిపారు. కేవలం చదువుకే  విద్యార్థులు పరిమితం కాకుండా అన్నిరంగాల్లో ప్రతిభ కనబరుస్తూ మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. పాఠశాలల ఏజీఎం సురేష్ విద్యార్థులను,ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ఆర్ఐ కోటయ్య చౌదరి, ఏజడ్సీఓ గోవింద్, వైస్ ప్రిన్సిపల్ రాధమ్మ ,డీన్ దస్తగిరి, ఏఓ జునైద్  మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Back to top button