NandyalAbdul Javid

ఘనంగా మహిళా దినోత్సవం

ఘనంగా మహిళా దినోత్సవం

నంద్యాల (పల్లెవెలుగు) 09 మర్చి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్స ఆధ్వర్యంలో సమతా పాల చంద్ర పాఠశాల యందు ఘనంగా నిర్వహించడం జరిగింది. నంద్యాలలో వివిధ రంగాలలో పని చేస్తున్నా అత్యున్నతమైన మహిళలకు సన్మానం చేయడం జరిగింది. నంద్యాల రోడ్డు క్లబ్ రాధికా, డాక్టర్ యశోద ఆయుష్ , రవీంద్ర హై స్కూల్ , సిల్వర్ ఓక్స్ మాధవిలత, ఎన్సిసి ఆఫీసర్ లలితా సరస్వతి మరియు సమత బాలచంద్ర స్కూల్ డైరెక్టర్ జయలక్ష్మి కి , అత్యున్నత సేవలందించి నందుకు గాను అసోసియేషన్ తరపున సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాజకీయరంగంలో అన్ని హంగులతో ముందుకు నడవాలని ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 30 పాఠశాల నుండి వచ్చిన టీచర్లకు అందరినీ ఘనంగా సత్కరించడం జరిగింది. కర్నూలు జిల్లా అధ్యక్షులు దండి దస్తగిరి, నంద్యాల అప్స అధ్యక్షులు వెంకటేశ్వర్లు కార్యదర్శి ఆకుమల్ల రహీం, ఉపాధ్యక్షులు రామి రెడ్డి మరియు పడకండ్ల సుబ్రహ్మణ్యం, రవీంద్రనాథ్, నాగరాజ రావు, మా భాష, సురేష్ తదితర కరస్పాండెంట్ హాజరై మహిళా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించడం జరిగినద.

Back to top button