NandyalAbdul Javid

మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

నంద్యాల (పల్లెవెలుగు) 08 మర్చి:  మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు నాగిని రవి సింగారెడ్డి  ఆధ్వర్యంలో పట్టణంలో. థాంక్యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరియు నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహాత్ బాజ్ పై,  వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాళ్లు, పట్టణ మహిళలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా మహిళ సహకర్ చైర్ పర్సన్ నాగిని రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళ పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అలాగే రాష్ట్రంలో నవరత్నాలతో ప్రతి కుటుంబంలో సంతోషం ఉండేవిధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని మహిళలు రాజకీయాల్లోనే కాకుండా అన్ని రంగాలలో  ముందుకు సాగాలని  నేడు మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలో మహిళలతో శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  నివాసం ఉండి శ్రీనివాస్ సెంటర్ వరకు భారీ ర్యాలీ ని నిర్వహించడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న మన్నారు

Back to top button