NandyalAbdul Javid

మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం –  శిబిరాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్

మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం –  శిబిరాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్

నంద్యాల (పల్లెవెలుగు) 08 మర్చి:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇన్నర్ వీల్ క్లబ్  సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాబి, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు మహిళలకు ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ కార్యదర్శి ఉస్మాన్ బాషా, ఉపాధ్యక్షులు, సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, మండల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు శ్రావణి, కార్యదర్శి మల్లేశ్వరి, సభ్యులు విజయలక్ష్మి, విజయ కుమారి, పద్మ, నాగమణి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సుధా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మహిళా వైద్యులతో మహిళలకు నిర్వహించిన ఈ ఉచిత శిబిరంలో దాదాపు వంద మందిని పరిశీలించి అవసరమైన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ చాహాత్ బాజ్ పెయ్ ను ఘనంగా సన్మానించారు.a

Back to top button
Enable Notifications    OK No thanks