NandyalMani News

వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి టిడిపికి పూర్వవైభవం తేవాలి – కార్యకర్తల కు భూమా పిలుపు

వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి టిడిపికి పూర్వవైభవం తేవాలి – కార్యకర్తల కు భూమా పిలుపు

నంద్యాల (పల్లెవెలుగు) 07 మర్చి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లో చేసిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవం తేవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మా నందరెడ్డి కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు..

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం అధిష్టానం నిర్వహిస్తున్న ఇంటింటికి గౌరవసభ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వార్డు కౌన్సిలర్ పిచుక నాగార్జున ఆధ్వర్యంలో  ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే  భూమా వార్డు లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భూమా మాట్లాడుతు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్షేమం పేరుతో కేవలం 15 శాతం ప్రజలకు డబ్బులు అందిస్తూ 80 శాతం ప్రజల బతుకులను దుర్భరంగా మార్చారన్నారు. నిత్యావసర వస్తువులధరలు ఆకాశాన్ని అంటాయని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటు పడిందన్నారుఏ వర్గాన్ని వదలకుండా రాక్షస పాలన చేస్తూ ప్రశ్నిస్తే కేసులు పెట్టి చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను వ్యక్తిత్వ హననం చేసి వేధిస్తున్న పరిస్థితి నెలకిందన్నారు. అందుకే తిరిగి అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనని ప్రియతమ నేత చంద్రబాబు శపథం చేసారన్నారు. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకుప్రతి కార్యకర 2024 లోతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు దేనికి భయపడవలసిన అవసరం లేదని తాను అండగా నిలుస్తునా నన్నారు. ఇక నంద్యాల నియోజకవర్గ వర్గ పరిస్థితి చూస్తే  టిడిపి హయాంలో నాడు భూమా నాగిరెడ్డి ,తాను చేసిన అభివృద్ధి తప్ప మూడేళ్ళ కాలంలో ఎం ఎల్ ఏ చేసిన పని ఒక్కటన్న చెప్పగలడా అని భూమా ప్రశ్నించారు.  నేడు నంద్యాల జిల్లా కావడానికి అవసరమైన రోడ్ల్ వెడల్పు అంతర్గత రహదారులు బైపాస్ రోడ్డు నిర్మాణాలను టీడీపీ హయంలో నే చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా భూమా గుర్తు చేశారు..నంద్యాలలో మెడికల్ ఆసుపత్రి అంటూ ఆన్లైన్ర్ పూజలు చేశారని జిల్లా స్థాయి ఆసుపత్రిలో సరైన వైద్యం అందిస్తున్నా రా అని భూమా ప్రశ్నించారు..టిడిపి హయాంలో తాము అన్నం వండి నోటికి అందిస్తే మింగటం కూడా చేతకాని ఈ ఎమ్మెల్యే నంద్యాలలో రెండు శిలాపలకలు వేసి అభివృద్ధి అంటున్నారని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యం మని చంద్రబాబు ని ముఖ్యమంత్రి గా చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈసందర్భంగా భూమా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button