NandyalAbdul Javid

ఐ.టీడీపీ నాయకులకు నియామక పత్రాలు అందజేసిన పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

ఐ.టీడీపీ నాయకులకు నియామక పత్రాలు అందజేసిన పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

నంద్యాల (పల్లెవెలుగు) 06 మర్చి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ సోషల్ మీడియా విభాగం అయిన ఐ.టీడీపీ నాయకులతో పరిచయ అభినందన సభలో నిర్వహించారు. అ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాలకు చెందిన ఐ.టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శులు ముల్లా ఖాజా హుస్సేన్, షేక్షావలి నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు దూదేకుల నరేష్. నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అలీకు పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫారూఖ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరచకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పదవులు పొందిన వారు పార్టీ కోసం కష్టపడితే భవిష్యత్తు ఉంటుందన్నారు

Back to top button