NandyalAbdul Javid

సోషల్ మీడియా వేదికగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

సోషల్ మీడియా వేదికగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

నంద్యాల (పల్లెవెలుగు) 03 మర్చి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్ టీడీపీ నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్ మాజీ శాసనసభ సభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అయిన ఐ.టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ అలీ  తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు తమపై నమ్మకంతో ఐ. టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా నియమించి పెంచారని ఈ కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం కష్ట పడతానని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టి ప్రజలకు తెలియచేయాలన్నారు నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ తెలుగుదేశం పార్టీ విజయంలో సోషల్ మీడియా సభ్యులు కీలకపాత్ర పోషించాలన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, హుందాగా ప్రజల మన్ననలు పొందే విధంగా సోషల్ మీడియా పోస్టులు మాత్రమే టీమ్ సభ్యులు పోస్టులు ఉండాలన్నారు భవిష్యత్తులో సోషల్ మీడియాను గ్రామ స్థాయిలో మరింత  బలోపేతం చేయాలని విజ్ఞేప్తి చేశారు

Back to top button
Enable Notifications    OK No thanks