NandyalAbdul Javid

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నైతిక భాధ్యతసహించి వెంటనే రాజీనామా చేయాలి

 అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నైతిక భాధ్యతసహించి వెంటనే రాజీనామా చేయాలి – తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్  డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 03 మర్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు అమరావతిని రాజధానిగా అభివృద్ధి పర్చాలనీ అమరావతికి అనుకూలంగా తీర్పునివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి, మూడురాజధానుల మోజులో ముసి ముసి నవ్వుల్లో ఉన్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టులాంటిదనీ, హైకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్రెడ్డి తన ప్రభుత్వం చేసిన తప్పిదానికి నైతిక బాద్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనీ  తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్  చేశారు . ఈ సందర్భంగా  తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నసమయంలో 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం కోసం వివిధ ప్రాంతాలను సూచిస్తూ, ప్రజాభిప్రాయ సేకరణ చేయడమేకాక అఖిలపక్షపార్టీలతో చర్చించి రాజధానికి సరైన ప్రాంతంగా అమరావతిని కరారు చేసి ఇందుకోసం భూసేకరణ చేసేందుకు నిర్ణయించి అసెంబ్లీలో రాజధాని నిర్మాణం పై చర్చించడం జరిగినదనంరు. ఈ సందర్భంలో అప్పటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ తరుపున సూచన చేస్తూ 30 వేల ఎకరాలకు పైగానే భూసేకరణ చేయాలనీ  అమరావతే సరైన ప్రాంతమనీ సాక్షాత్తు అసెంబ్లీలో సూచన చేశారు . ప్రతిపక్షాల సూచనలను గౌరవించిన చంద్రబాబునాయుడు రాజధాని కోసం భూములివ్వాలని రైతులకు పిలుపునివ్వగా 32 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం రైతులు ప్రభుత్వానికి స్వచ్చందంగా స్వాధీనం చేయడం జరిగింది. వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి రాజధాని నిర్మాణం పనులను చేపట్టి ముందుకు వెళ్లారు . అయితే ఒక అవకాశమివ్వమని కోరిన వై.సి.పి. నేత జగన్ మాటలను నమ్మి 2019 లో వై.సి.పి.కి అధికారాన్నిస్తే ముఖ్యమంత్రి భాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ నిర్మాణాలను కూలగొట్టడం, 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం, అమరావతిని గ్రాఫిక్ రాజధాని అంటూ, ఎడారి అంటూ వై.సి.పి. వారు అమరావతి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేశారు. తమ భూములు త్యాగం చేసిన రైతులు రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటాలు కొనసాగించారు. దీక్షలు చేపట్టారు. చివరికి న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారి పాదయాత్రను కొనసాగించి, న్యాయస్థానంలో పోరాటాలు చేయడం , వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు .  ప్రభుత్వం చివరికి మహిళలను కూడా వదిలిపెట్టలేదు. పేయిడ్ ఆర్టిస్టులంటూ అవమానకరంగా మాట్లాడటం అరెస్టులు చేయడం యస్.సి.లపైనే యస్.సి.యస్.టి , అట్రాసిటీ కేసులు పెట్టడం చరిత్రలో ఎక్కడచూడలేదనీ , ఒక్క అమరావతి రైతులు | మాత్రమే ఈ భాదలు అనుభవించారనీ, వారందరి పోరాటాల ఫలితంగా వారి దీవెనలతో ఈ రోజు హైకోర్టులో కూడా అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చిందని  ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి సమాదానమిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన్రెడ్డి తన మొండి వైఖరిని విడనాడాలనీ మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి  ఈ మూడు సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని రైతులను ఎంతో మనో వేధనకు గురిచేయడమేకాక  ఎంతో మంది అమరావతి రాజధాని రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనీ  వారందరి కుటుంబాలకు ఏమి సమాదానం ఇస్తారని ప్రశ్నించారు. మీరు చేసినది తప్పు అని న్యాయస్థానం తేల్చిచెప్పినందున మీ తప్పును సరిదిద్దు కునేందుకు వెంటనే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజానామా చేయాలని మరోసారి డిమాండ్ చేసారు.

Back to top button