NandyalAbdul Javid

ఉర్దూ సాహిత్య అభిమానులతో ఏర్పాటు అయిన “కార్వాన్-ఎ-ఉర్దూ”

ఉర్దూ సాహిత్య అభిమానులతో ఏర్పాటు అయిన “కార్వాన్-ఎ-ఉర్దూ”

నంద్యాల (పల్లెవెలుగు) 03 మర్చి: ఉర్దూ సాహిత్య ప్రియులు కలిసి ఉర్దూ అభివృద్ధి కోసం “కార్వాన్-ఎ-ఉర్దూ” సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. జమాఆతె ఇస్లామీయ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ అధ్యక్షుతన జమాత్ కార్యాలయంలో సమావేశం అయిన నంద్యాల పట్టణ ఉర్దూ భాష అభిమానులు ఉర్దూ కవుల సమ్మేళనాలు, ముషాయిరాలు, విద్యార్థులకు వ్యాస, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఉర్దూ భాష తీయదనం పరిచయం చేయాలనీ, ఉర్దూ భాష అభివృద్ధి “కార్వాన్-ఎ-ఉర్దూ” ద్వార చేయాలని నిర్ణయించారని సమద్ తెలిపారు. సీ.అబ్దుల్ అజీజ్ ను కన్వీనర్ గా, రిటైర్డు యం.ఆర్.ఓ ఫకీర్ ఆహమద్, హాఫీజ్ షొయబ్ జుమాను కో కన్వినర్లుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డా.మోహిద్దీన్ అమ్జద్, యం.జమాన్, జమాల్ వలి, హనీఫ్, అబ్దుల్ జబ్బార్, నజీర్ అహ్మద్, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు. 19-3-22 రంజాన్ ను స్వాగతిస్తు “ముషాయిరా” నిర్వహిస్తున్నట్లు అజీజ్ తెలిపారు.

Back to top button