NandyalAbdul Javid

సంక్షేమ వసతిగృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి – PDSU డిమాండ్

.సంక్షేమ వసతిగృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి – PDSU డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 01 మర్చి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలలో మౌళిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు రాష్ట్ర కార్యవర్గం పిలుపు భాగంగా సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాష, PDSU కర్నూలు జిల్లా అధ్యక్షులు SMD. రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకె పరిమితం చేసిందే తప్ప ప్రభుత్వ వసతి గృహాలను పూర్తిగా దూరం చేసిందని 100 మందికి పైగా ఉండవలసిన విద్యార్థులు కేవలం 10 మంది విద్యార్థులతో ఈ రోజు ప్రభుత్వ వసతి గృహాలు కొట్టుమిట్టడుతున్నాయని దీనికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం పెంచుతూ మరోపక్క హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలను పెంచడంలో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందన్నారు. జిల్లాలో అనేక సంక్షేమ వసతిగృహాలు సొంతభవనాలు లేవన్నారు. అలాగే ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ మరియు కమాటి, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేయాలనీ, ప్రతి నెల  విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యలను కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU నవీన్, కిరణ్, మల్లికార్జున, సాకేత్, వలి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Back to top button